రానున్న మూడు నెలల త్రాగునీటి అవసరాల నిమిత్తం జిల్లాలోని అన్ని సమ్మర్ స్టోరేజి ట్యాంకులు, పశువుల చెరువులను పూర్తి స్థాయికి నింపాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడలో శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆర్ డబ్ల్యూ ఎస్, పంచాయితీ, జిల్లా పరిషత్, పాడా అధికారులతో వేసవి కార్యాచరణ ప్రణాళికలపై సమీక్షించారు.