కాకినాడ జిల్లాలో ఈ నెల 15 వ తేదీన ప్రతీ గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో స్వచ్ఛంద్రా - స్వర్ణాంధ్ర కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులు, రెవిన్యూ అధికారులు, మండల అభివృద్ధి అధికారులతో కలెక్టర్ టేలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.