2025 కల్లా టీబీ నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోసన్ సగిలి పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు వారాలకు మించి దగ్గు, కళ్లేరావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, తరచూ జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం తదితర లక్షణాలు ఉన్నవారు పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు.