కాకినాడ: చితక్కొట్టుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు

51చూసినవారు
కాకినాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండగైరం‌పేటలో టీడీపీ, జనసేన కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. గ్రామంలో టీడీపీ నేత శుభకార్యం నిర్వహించగా ఇరు పార్టీల నేతల హాజరయ్యారు. ఈ క్రమంలో తమ పార్టీ అండతోనే టీడీపీ గెలిచిందని జనసేన నేతలు వ్యాఖ్యనించడంతో గొడవ మొదలై ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు. పలువురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చివరికి పార్టీ పెద్దలు సర్ధి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

సంబంధిత పోస్ట్