సెకండరీ గ్రేడ్ టీచర్లకు మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరుగుతుందని ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం పేర్కొన్నారు. మంగళవారం వివిధ ఉపాధ్యాయ సంఘాలు కాకినాడలో ఎమ్మెల్సీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రాజశేఖరంను కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు.