కాకినాడ: కార్మికులను దోచుకుంటున్న కూటమి ప్రభుత్వం

73చూసినవారు
కార్మికులను దోచుకోవడంలో జనసేన, టీడీపీ, వైసీపీ మూడు పార్టీలకు ఒకే విధానమని అమలు చేయడం జరుగుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ విమర్శించారు. మంగళవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కంచెపు సత్తిరాజు, ఏపీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకటరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్