అపర భగీరథుడు కాటన్ దొర అని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తివేణుగోపాలరావు, పంచాయతీ రాజ్ ఎస్ ఇ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాటన్ దొర 220వ జయంతి సందర్భంగా గురువారం జిల్లా పరిషత్ కార్యాలయంలో కాటన్‌దొర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్రపోషించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ దొర అని వారు పేర్కొన్నారు.