కాకినాడ: సమాచార శాఖ ఉద్యోగుల సేవలు చిరస్మరణీయం

68చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలలో భాగంగా కాకినాడ జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులకు శుక్రవారం సాయంత్రం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. కాకినాడ రామారావుపేటలోని జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బదిలీపై వెళ్తున్న ఉద్యోగుల సేవలను ఉన్నతాధికారులు, సిబ్బంది కొనియాడారు. పీఆర్వోగా పని చేస్తున్న రవి.. డా. బిఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్