ఓటరు జాబితాను దోషరహితంగా రూపొందించడంలో సంబంధిత అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర మైన్స్ అండ్ జువాలజీ శాఖ కమిషనర్ మరియు డైరెక్టర్, కాకినాడ జిల్లా ఎలక్ట్రోల్ రోల్ అబ్జర్వర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కాకినాడ లో బుధవారం సాయంత్రం స్ధానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలితో కలిసి ఎస్ఎస్ఆర్-2025 ఓటర్ల జాబితా స్వచ్చీకరణపై ఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమీక్షించారు.