అగ్నిప్రమాదాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేటట్టు విస్తృత అవగాహన కల్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ అన్నారు. ఏప్రిల్ 14 నుంచి 20వరకు అగ్ని సురక్షిత భారతదేశానికి ఐకమత్యం ఇవ్వండి అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సోమవారం కాకినాడ రామారావు పేటలో ఉన్న జిల్లా అగ్నిమాపక కేంద్ర కార్యాలయం ప్రాంగణంలో అగ్నిమాపక వారోత్సవాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ప్రారంభించారు.