అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదిని పురస్కరించుకుని, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆర్మడ్ రిజర్వు పోలీసులు శుక్రవారం సామూహిక యోగా అభ్యాసాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం మే 21 నుండి జూన్ 21 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న "యోగాంధ్ర" వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు.