రేపు కాకినాడలో మాల మహానాడు శాంతియుత నిరసన ర్యాలీ

56చూసినవారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన మాల వ్యతిరేక కార్యకలాపాలకు నిరసనగా కాకినాడలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మాల మహానాడు జాతీయ నేత ఆర్ఎస్ రత్నాకర్ తెలిపారు. మంగళవారం ఆయన కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ రేపు (బుధవారం) అన్ని జిల్లాల కలెక్టర్ ఆఫీసుల వద్ద శాంతియుత ప్రజాస్వామ్యయుత నిరసన చేపట్టడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రత్నాకర్ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్