భవనాలు కూలడం, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఈ నెల 16న కలెక్టరేట్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు తెలిపారు. మంగళవారం సాయంత్రం డిఆర్ఓ చాంబరులో జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కమిటీ సమావేశం జిల్లా రెవెన్యూ అధికారి జె. వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విపత్తుల నియంత్రణ సంస్థ సూచనల కనుగుణంగా విపత్తు సమయాల్లో చేపట్టవలసిన ప్రామాణిక రక్షణ, సహాయక చర్యలను ఆయా శాఖలకు నిర్థేశించడం జరిగిందన్నారు.