అమ్మతనం కన్నా కమ్మనైన ఈ సృష్టిలో లేదని అమ్మను అందరూ దైవంగా ఆరాధించి పూజించాలని కొత్తపేట ఐసీడీఎస్ సీడీపీఓ అధికారి గజలక్ష్మి అన్నారు. మదర్స్ డేను పురస్కరించుకుని ఒక రోజు ముందుగా మండల కేంద్రమైన ఆలమూరులో గ్రామ అంగన్‌వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈకార్యక్రమాన్ని సీడీపీఓ గజలక్ష్మి ప్రారంభించారు. అంగన్‌వాడీ చిన్నారులందరూ తమ తల్లులకు కాళ్లు కడిగి పాదపూజ చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు.