మోడీ ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలపై ఈ నెల 16 తేదీన దేశవ్యాప్త బంద్ ను జయప్రదం చేయాలని వామపక్ష నాయకులు తోకల ప్రసాద్, తాళ్ళారురాజు, రాజ్ కుమార్ తెలిపారు. మంగళవారం కాకినాడ ఇంద్ర పాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద దేశవ్యాప్త బంద్ కు సంబంధించి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను అమలు చేసిందన్నారు.