కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

64చూసినవారు
కాకినాడ జిల్లా కలెక్టరేట్లో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
కాకినాడ జిల్లా కలెక్టరేట్ విధాన గౌతమిహాల్లో సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 9 గంటలకు సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు తెలుపవచ్చు అని తెలిపారు. వివిధ విభాగాల జల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్