సక్రమంగా ‘ఎన్‌టీఆర్‌ భరోసా’ పంపిణీ

65చూసినవారు
సక్రమంగా ‘ఎన్‌టీఆర్‌ భరోసా’ పంపిణీ
జూలై 1వ తేదీన జరిగే ఎన్‌టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో లబ్థిదారులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న పింఛన్‌ను రూ. 3వేలు నుంచి రూ. 4వేలకు పెంచడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్