రాజమండ్రి: దోమల నివారణకు యాంటీ లార్వా స్ప్రే

65చూసినవారు
రాజమండ్రి: దోమల నివారణకు యాంటీ లార్వా స్ప్రే
ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం భాగంగా రాజమండ్రి నగరపాలక సంస్థ పారిశుధ్య & ఆరోగ్య సిబ్బంది వివిధ ప్రాంతాలలో దోమల నివారణ కోసం శుక్రవారం యాంటీ లార్వా స్ప్రే చేశారు. ఈ చర్యలు దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధుల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి ఎ. వినూత్న అన్నారు. ప్రజల ఆరోగ్య రక్షణకు మరింత సమర్థవంతమైన పరిష్కారం అందించడమే లక్ష్యం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్