రాజమండ్రి: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

78చూసినవారు
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ 17వ తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద అందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు బుధవారం రాజమండ్రిలో వెల్లడించారు. ఈ ఆందోళన కార్యక్రమం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనజ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. కావున పార్టీ శ్రేణులు, ఇళ్ల స్థలాల లబ్ధిదారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్