శంఖవరం: చెప్పుల దండ వేసిన వారిని కఠినంగా శిక్షిస్తాం

69చూసినవారు
కాకినాడ జిల్లా శంఖవరం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన దుండగులను అరెస్టు చేసి కఠినంగా శిక్షిస్తామని అన్నవరం పోలీసులు హామీ ఇచ్చారు. సోమవారం రాత్రి సమయంలో ఈ ఘటన జరగగా వారిని అరెస్టు చేయాలంటూ దళిత నాయకులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అన్నవరం పోలీసులు మాట్లాడుతూ ఈ విగ్రహం వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి దుండగులను గుర్తించి అరెస్టు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్