ప్రభుత్వాసుపత్రి సురక్షితమని నమ్మి చేరిన గర్భిణికి నిర్లక్ష్యమే శిశువు మృతికి కారణమైంది. తాళ్లరేవు సీహెచ్సీలో శనివారం తెల్లవారుజామున నొప్పులు వచ్చినా, సిబ్బంది స్పందించలేదు. స్వీపర్ సాయంతో ప్రసవించిన మగబిడ్డ మృతిచెందాడు. దీన్ని సహించని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రి స్టాఫ్ నర్సు ఇందిరను సస్పెండ్ చేసినట్టు ఆర్డీవో తెలిపారు.