కాకినాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొండ గైరంపేటలో టీడీపీ,వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరుపార్టీలకు చెందిన కార్యకర్తలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.