కాకినాడ పోర్ట్ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

63చూసినవారు
30 సంవత్సరాలుగా కాకినాడ పోర్టు పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారని నేటికీ కార్మిక చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ తెలిపారు. బుధవారం కాకినాడలోని కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన తెలియజేశారు. కనీస వేతనం 20వేల రూపాయల అమలు చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ , కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్