అంబేడ్కర్ విగ్రహానికి చెప్పుల దండ వేసిన వారిని 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. శంఖవరం మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు, దళిత నాయకులు బుధవారం రోడ్డుపై బైఠాయించి అంబేడ్కర్ ను అవమానించిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న ఎస్పీ 24 గంటల్లో వారిని పట్టుకుంటామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.