కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలి

60చూసినవారు
కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్ లు రద్దు చేయాలని, ఏ రంగంలో కార్మికులకైనా కనీస వేతనం 26, 000 రూ. అమలు చేయాలని సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి. బేబిరాణి పిలుపు ఇచ్చారు. మంగళవారం కాకినాడ యుటిఎఫ్ హోం లో సిఐటియు నగర విస్తృత సమావేశం జరిగింది. పలివెల వీరబాబు, ఎంకె జ్యోతి, భారతి లు అధ్యక్షవర్గంగా వ్యవహరించిన ఈ సమావేశంలో బేబిరాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్