వేట నిషేధం ముగియడంతో కాకినాడ ఏటిమొగకు చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం మహిళలు గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగిరావాలని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండబాబు పాల్గొని పూజలు నిర్వహించారు.