దుద్దుకూరులో భారీ వర్షం

71చూసినవారు
దుద్దుకూరు గ్రామంలో శనివారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఈ అతి భారీ వర్షానికి రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. హైవే రోడ్డు అన్ని చోట్లా నీరు నిలిచిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలం పనికి వెళ్లేవారు చెట్ల కింద ఉండరాదని అధికారులు హెచ్చరించారు. మరో ఐదు రోజులు ఇలాగే వర్షం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్