పేద ప్రజలకు రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న బియ్యాన్ని రీసైకిలింగ్ చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఆయన రాష్ట్ర పౌరసరఫరాల ఎండీ వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి, జిల్లా రెవిన్యూ, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల అధికారులతో కలిసి కాకినాడ, కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని బియ్యం గోడౌన్లను తనిఖీ చేశారు.