కాకినాడ రెవిన్యూ డివిజన్ పరిధిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించే కోడిపందాలు ఇతర జూద క్రీడలపై నిషేధం విధిస్తున్నామని కాకినాడ ఆర్డీవో ఎస్ మల్లిబాబు తెలిపారు. గురువారం సాయంత్రం మల్లిబాబు అద్యక్షతన ఆర్ డిఓ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే సంప్రదాయ సంక్రాంతి పండగల నేపథ్యంలో కోడిపందాలు, జూద క్రీడల నిషేధాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి తీసుకొను చర్యలపై చర్చించారు.