కాకినాడ రూరల్ కరప హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలిక ఈ నెల 8న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. స్నేహితురాలి పుట్టినరోజు వేడుకకు వెళ్లినట్టు చెప్పిన ఆమె ఆ తర్వాత కనిపించలేదు. బాలిక తల్లి సోమవారం కరప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్ఐ సునీత మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.