సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుందని ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, కూటమి పాలనే ప్రజల పాలనగా చంద్రబాబు పని చేయడం జరుగుతుందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యనారాయణ మూర్తి, పిల్లి అనంత లక్ష్మి తెలిపారు. గురువారం సాయంత్రం కాకినాడ రూరల్ లో మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి పాదయాత్ర చేపట్టారు.