కాకినాడ రూరల్ చిత్రాడ గ్రామంలో శుక్రవారం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఏర్పాట్లను దగ్గరుండి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ రూరల్ నుంచి భారీ స్థాయిలో సభకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రారంభం అవుతుందని అన్నారు. ముఖ్య నాయకులతో పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగం చేస్తారు.