విద్యార్థుల ప్రగతి, వారు విద్యలో ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలల సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం చక్కని వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తుందని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ అన్నారు. శనివారం కరప మండలంలోని అరట్లకట్ల జడ్పీ హైస్కూల్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేయాలన్నారు.