కాకినాడ: సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా శోభారాణి

68చూసినవారు
కాకినాడ: సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గా శోభారాణి
కాకినాడ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎం.ఎస్. శోభారాణి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న శ్రీనివాసరావు బదిలీ కావడంతో, తూర్పు గోదావరి జిల్లాలో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న శోభారాణిని ఈ నియామకం చేశారు. శోభారాణి గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడలోనే డిప్యూటీ డైరెక్టర్‌గా సేవలు అందించారు. విధుల్లో నూతనంగా చేరిన ఆమెకు శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్