కాకినాడ జిల్లాలో ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించిన జిల్లాస్థాయి యోగా పోటీల్లో 12 విభాగాల్లో 45 మంది విద్యార్థులు విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయితే వీరిని ఆదివారం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారులు విజయవాడకు పంపించారు. ఈ నెల 16, 17 తేదీల్లో అక్కడ జరిగే రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో వారు పాల్గొంటారని జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ వి. సతీశ్ తెలిపారు.