కరప గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఈ నెల 8న ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన తెలిసిందే. తల్లిదండ్రులు అదే రోజున పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారం గడిచినా ఆమె ఆచూకీ దొరకకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనతో ప్రతిరోజూ పోలీస్ స్టేషన్ వద్దకి వచ్చి వెళ్తున్నారు. బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని రూరల్ సీఐ చైతన్య కృష్ణ తెలిపారు. ఎస్సై సునీత నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోందన్నారు.