కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రమాదకర కర్మాగారాలను బుధవారం తనిఖీ చేసినట్లు డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ తెలిపారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం లోని ప్రమాదకర కర్మాగారాలను తనిఖీ చేసామన్నారు, ప్రమాదకర పదార్థాల నిలువ చేస్తున్న ట్యాంకులను పరిశీలించి, సెన్సార్స్ ఏర్పాటు గురించి, ఆపరేషన్ పద్ధతులు గురించి, మంటలు ఆర్పేందుకు ఫోం వ్యవస్థ గురించి సూచన ఇచ్చినట్లు తెలిపారు.