హెచ్ఐవి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐసిటిసి ఆధ్వర్యంలో పి. హెచ్. సి అవిడి సిబ్బందితో కలిసి శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్పపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. గన్నవరపు దుర్గా ప్రసాద్, డాక్టర్ వీరబాబు, హెడ్ నర్స్ దేవి జనని, ఐ సి టి సి కౌన్సిలర్ మెల్లం దుర్గాప్రసాద్ ఐ సి టి సి ల్యాబ్ టెక్నీషియన్ అడబాల వెంకటరత్నం, వి. సద్గుణ రావు, సాయి శ్రీ, మమత పాల్గొన్నారు.