ఆలమూరు: సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ ప్రెస్ క్లబ్ కృషి

79చూసినవారు
ఆలమూరు: సమస్యలను పరిష్కరించేందుకు సీనియర్ ప్రెస్ క్లబ్ కృషి
ప్రజా సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార దిశగా పనిచేసేందుకు ఆలమూరు సీనియర్ ప్రెస్ క్లబ్ తీర్మానించింది. మండల కేంద్రమైన ఆలమూరులో శుక్రవారం ఆలమూరు ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది. ప్రెస్ క్లబ్ సభ్యులు పలు అంశాలపై చర్చించారు. పరిష్కారం కానీ ప్రజా సమస్యలను గుర్తించి వాటిని మీడియా ద్వారా అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

సంబంధిత పోస్ట్