ఆలమూరు: కాలువకు నీరు విడుదల చేసిన చైర్మన్ గోపాలస్వామి

54చూసినవారు
ఆలమూరు: కాలువకు నీరు విడుదల చేసిన చైర్మన్ గోపాలస్వామి
ఆలమూరు మండలం చొప్పెల్ల కాలువకు వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మెర్ల గోపాలస్వామి శుక్రవారం పూజలు చేసి నీటిని విడుదల చేశారు. ఈ కాలువ ద్వారా చొప్పెల్ల, నర్సిపూడి, మోదుకూరు, గుమ్మిలేరు, మండపేట గొల్లపుంత ప్రాంతాలలో 3,400 ఎకరాలు సాగు అవుతుంది. ఈ సందర్భంగా గోపాలస్వామి మాట్లాడుతూ ఈ కాలువపై సాగినీటి ఇబ్బందులు లేకుండా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు.

సంబంధిత పోస్ట్