దివ్యాంగ పిల్లలకు భవితా కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయని ఎంపీడీవో ఏ. రాజు అన్నారు. పారా సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఆలమూరు భవిత దివ్యాంగుల పాఠశాల నందు దివ్యాంగ పిల్లల, తల్లిదండ్రులకు కేర్ గివెర్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ఆయన నిర్వహించారు. విభిన్న ప్రతిభావంతుల కో ఆర్డినేటర్ బడుగు మహిమారావ్, బడుగు సుబ్బాయమ్మ రిసోర్స్ పర్సన్ గా పాల్గొని విభిన్న ప్రతిభావంతుల హక్కుల గురించి వివరించారు.