ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన ఇంటర్ విద్యార్థి మీసాల శివప్రసాద్ కళాశాలకు సరిగా వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపంతో బుధవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతడి మృతదేహం మూలస్థానం పెద్దకాలువలో శుక్రవారం కనిపించడంతో చొప్పెల్ల లాకుల వద్ద ప్రధాన కాలువలో బుధవారం రాత్రి దూకేసి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆలమూరు పోలీసులు తెలిపారు.