ఆంధ్రప్రదేశ్ సాక్షి మీడియా ఎడిటర్ ఆర్. ధనుంజయ్ రెడ్డి పై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నమోదు చేసిన కేసును సత్వరమే ఉప సంహరించుకోవాలని ఆలమూరు ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది. ఈమేరకు శుక్రవారం తహసీల్దార్ కేజే. ప్రకాష్ బాబుకు ప్రెస్ క్లబ్ సభ్యులు వినతిపత్రం అందజేసారు. మీడియా ప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సమంజసంకా దన్నారు. ఈ మేరకు డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని ప్రెస్ క్లబ్ సభ్యులు అందజేసారు.