ఆలమూరు ప్రభుత్వ పశు వైద్యశాల వద్ద మంగళవారం "యోగాంధ్ర" కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏడీఏ డా. ఎల్. అనిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ఆలమూరు, కపిలేశ్వరపురం మండలాల పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బంది యోగాసనాలు వేశారు. ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని డా. కె. వెంకట్రావు తెలిపారు.