ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో విఎన్సిసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్యాన్నదాన భవన నిర్మాణానికి భక్తులు రూ .లక్ష విరాళంగా ఇచ్చినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. కొత్తపేట వాస్తవ్వులు నేదునూరి సూర్యనారాయణ అనంత లక్ష్మి సత్యవతి దంపతులు ఆదివారం శ్రీ స్వామివారిని దర్శించుకుని వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి విరాళం ఇచ్చినట్లు చెప్పారు.