ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి యున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి భక్తులు రూ. 5 లక్షలు విరాళాన్ని అందజేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. రాజమండ్రి వాస్తవ్వులు కొవ్వురి శివ శంకర రెడ్డి పద్మ మరియు వారి కుటుంబ సభ్యులు శుక్రవారం స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ. 5, 01, 000 రూపాయలు విరాళంగా సమర్పించినట్లు చెప్పారు.