ఆత్రేయపురం మండలం లొల్ల వద్ద రూ 2. 92 కోట్ల వ్యయంతో జరుగుతున్న సైఫాన్ పనులను ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు శుక్రవారం పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. సైఫాన్ నిర్మాణం పనుల వల్ల శనివారం వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళే వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.