ఆత్రేయపురం: విమాన ప్రమాదం దేశాన్ని కదిలించింది

66చూసినవారు
ఆత్రేయపురం: విమాన ప్రమాదం దేశాన్ని కదిలించింది
అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశాన్ని కదిలించిందని ఆత్రేయపురం మండల బీజేపీ అధ్యక్షుడు యు. వెంకటేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆత్రేయపురం లో శనివారం ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే విమానం కూలిన మెడికల్ హాస్పిటల్ హాస్టల్ భవనంలో ఉన్న వైద్య విద్యార్థులు, నర్సులు సహా మరో 25 మంది మరణించడం హృదయవిదారక ఘటనగా పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్