ఆత్రేయపురం: వాడపల్లిలో టిటిడి చైర్మన్ నాయుడు పూజలు

76చూసినవారు
ఆత్రేయపురం: వాడపల్లిలో టిటిడి చైర్మన్ నాయుడు పూజలు
ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి గురువారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సాంప్రదాయ పద్ధతులతో నాయుడుకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. వేద పండితులు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్థల పురాణాన్ని నాయుడుకు వివరించారు.

సంబంధిత పోస్ట్