అపరిచిత వాట్సాప్ కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రావులపాలెం టౌన్ సిఐ జేమ్స్ రత్న ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం లో గుర్తుతెలియని వ్యక్తులువాట్సాప్ కాల్ చేసి మనీ లాండరింగ్ కేసులో మీరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని, డబ్బు చెల్లించినట్లయితే ఈ కేసు నుంచి తప్పించ బడతారని మోసం చేస్తూ డబ్బులు కాజేస్తున్నారన్నారు.